యూనుస్ · 30/109
అనువాదం ఉచ్చారణ — సూరా యూనుస్
هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَّا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ۝٣٠
Hunaalika tabloo kullu nafsim maaa aslafat; wa ruddoo ilal laahi mawlaahu mul haqqi wa dalla `anhum maa kaanoo yaftaroon
📖 తెలుగులో
అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి

🎧 వినండి


📜 వచనం 28-32 — సూరా యూనుస్

28وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا مَكَانَكُمْ أَنتُمْ وَشُرَكَاؤُكُمْ ۚ فَزَيَّلْنَا بَيْنَهُمْ ۖ وَقَالَ شُرَكَاؤُهُم مَّا كُنتُمْ إِيَّانَا تَعْبُدُونَ
మరియు మేము వారందరినీ సమావేశపరచిన రోజు, సాటి కల్పించిన (షిర్కు చేసిన) వారితో ఇలా అంటాము: మీరునూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!" ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము. వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినవారు (వారి దైవాలు) ఇలా అంటారు: మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు
29فَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَافِلِينَ
ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు
30هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَّا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి
31قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ
వారిని అడుగు: ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా
32فَذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمُ الْحَقُّ ۖ فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు
యూనుస్ఖురాన్ సూచిక
109వచనం
MeccanRevelation
30వచనం

అనువాదం — యూనుస్ 30

సూరా యూనుస్ వచనం 30 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ…

సూరా వచనం 30/109 — సూరా యూనుస్ يونس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా యూనుస్ వినండి, సూరా యూనుస్ అనువాదం, సూరా యూనుస్ mp3, సూరా యూనుస్ pdf. వచనం 28–32. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers