Wa laa takoonoo kallatee naqadat ghazlahaa mim ba`di quwwatin ankaasaa; tattakhizoona aimaanakum dakhlalam bainakum an takoona ummatun hiya arbaa min ummah; innnamaa yablookumul laahu bih; wa la yubaiyinanna lakum yawmal Qiyaamati maa kuntum fee takhtalifoon
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और तुम लोग (क़समों के तोड़ने में) उस औरत के ऐसे न हो जो अपना सूत मज़बूत कातने के बाद टुकड़े टुकड़े करके तोड़ डाले कि अपने एहदो को आपस में उस बात की मक्कारी का ज़रिया बनाने लगो कि एक गिरोह दूसरे गिरोह से (ख्वामख़वाह) बढ़ जाए इससे बस ख़ुदा तुमको आज़माता है (कि तुम किसी की पालाइश करते हो) और जिन बातों में तुम दुनिया में झगड़ते थे क़यामत के दिन ख़ुदा खुद तुम से साफ साफ बयान कर देगा
అల్లాహ్ తన విశ్వాసులను హెచ్చరిస్తూ, ఒప్పందాలను భంగపరచవద్దని, మాటను తప్పకూడదని బోధిస్తున్నాడు. ఒక స్త్రీ తన శ్రమతో నూలు వడికి, దాన్ని గట్టిగా పేని, ఆ తర్వాత దాన్ని మళ్ళీ విప్పేసి, పనికిరాని దారాలుగా చేసినట్లు మీరు కూడా మీ ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చకుండా భంగపరచవద్దు. మీరు ఒక జాతితో ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత వారి కంటే ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ బలంలో ఉన్న మరొక జాతిని చూసి, మొదటి ఒప్పందాన్ని మోసంగా విచ్ఛిన్నం చేయకూడదు. ఇలా చేయడం ద్వారా మీరు మీ విశ్వాసాన్ని, మీ మాటను చౌకగా అమ్ముకున్నట్లు అవుతుంది. వాస్తవానికి, అల్లాహ్ మీకు ఇచ్చిన ఈ ఆదేశాల ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు – మీరు ఒప్పందాలను నెరవేరుస్తారా, లేక భంగపరుస్తారా అని. మరియు ప్రళయ దినాన, మీరు ఈ లోకంలో ఏ విషయాలలో విభేదించుకున్నారో, ఎవరు సత్యవంతులో, ఎవరు అసత్యవంతులో, ఎవరు న్యాయవంతులో, ఎవరు అన్యాయవంతులో అల్లాహ్ మీకు స్పష్టంగా తెలియజేస్తాడు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఒప్పందాల పట్ల నిబద్ధత: ఇస్లాం విశ్వాసులను ఎప్పుడూ తమ మాటను నిలబెట్టుకోవాలని, ఒప్పందాలను గౌరవించాలని బోధిస్తుంది. ఇది ఒక విశ్వాసి యొక్క గౌరవానికి, నిజాయితీకి నిదర్శనం.
మోసం నుండి దూరం ఉండటం: ప్రయోజనం కోసం లేదా భయం కోసం ఇతరులను మోసం చేయడం, ముఖ్యంగా ఒప్పందాలను భంగపరచడం ఇస్లాంలో పెద్ద పాపం. ఇది సమాజంలో అపనమ్మకాన్ని, శత్రుత్వాన్ని పెంచుతుంది.
అల్లాహ్ పరీక్ష: ఈ లోక జీవితం ఒక పరీక్ష. అల్లాహ్ మనకు ఇచ్చిన సంపద, శక్తి, సంఖ్యాబలం అన్నీ పరీక్షలే. వాటి ఆధారంగా మనం న్యాయంగా, నిజాయితీగా ఉంటున్నామా లేదా అని పరీక్షిస్తాడు.
ప్రళయ దినంలో న్యాయం: ఈ లోకంలో ఎవరు ఏ విషయంలో విభేదించుకున్నా, ప్రళయ దినాన అల్లాహ్ సత్యాన్ని బయటపెడతాడు. అప్పుడు ఎవరూ అన్యాయం చేయబడరు. ఇది న్యాయాన్ని, సత్యాన్ని ప్రేమించే వారికి ఓదార్పునిస్తుంది.
మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు
నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని
మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు
మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు
ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు
మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు. మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.