అల్-అన్ఆమ్ · 82/165
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-అన్ఆమ్
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ ۝٨٢
Allazeena aamanoo wa lam yalbisooo eemaanahum bizulmin ulaaa`ika lahumul amnu wa hum muhtadoon
📖 తెలుగులో
ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 80-84 — సూరా అల్-అన్ఆమ్

80وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
మరియు అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా! అతను వారితో అన్నాడు: ఏమీ? మీరు నాతో అల్లాహ్ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి (భాగస్వాములుగా) కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్ఛ లేనిది (ఏదీ సంభవించదు). నా ప్రభువు సకల వస్తువులను (తన) జ్ఞానంతో ఆవరించి వున్నాడు. ఏమీ? మీరిది గ్రహించలేరా
81وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
మరియు మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు)గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి, ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే, మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో! మీకు తెలిస్తే చెప్పండి
82الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు
83وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు)
84وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్ కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము
అల్-అన్ఆమ్ఖురాన్ సూచిక
165వచనం
MeccanRevelation
82వచనం

అనువాదం — అల్-అన్ఆమ్ 82

సూరా అల్-అన్ఆమ్ వచనం 82 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే…

సూరా వచనం 82/165 — సూరా అల్-అన్ఆమ్ الأنعام (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-అన్ఆమ్ వినండి, సూరా అల్-అన్ఆమ్ అనువాదం, సూరా అల్-అన్ఆమ్ mp3, సూరా అల్-అన్ఆమ్ pdf. వచనం 80–84. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers