PDF —
182 వచనం Meccan PDF
Built right in your browser — download starts automatically

సూరా అస్-సాఫ్ఫాత్ pdf — డౌన్‌లోడ్ (తెలుగు)

సూరా అస్-సాఫ్ఫాత్ pdf తెలుగు — డౌన్‌లోడ్ సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం. సూరా అస్-సాఫ్ఫాత్ (Meccan) 182 వచనం.

← యాసీన్సూరా అస్-సాఫ్ఫాత్ సాద్ →


182 వచనం · Meccan · తెలుగు
bismillah
ﭑﭒﭓ
37:1 వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా
ﭔﭕﭖ
37:2 మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా
ﭗﭘﭙ
37:3 ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా
ﭚﭛﭜﭝ
37:4 నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
37:5 ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు
ﭦﭧﭨﭩﭪﭫﭬ
37:6 నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము
ﭭﭮﭯﭰﭱﭲ
37:7 మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼ
37:8 ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు
ﭽﭾﭿﮀﮁﮂ
37:9 (ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
37:10 కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది
ﮋﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕﮖﮗﮘ
37:11 అయితే వారిని అడగిండి: ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము
ﮙﮚﮛﮜ
37:12 వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు
ﮝﮞﮟﮠﮡ
37:13 మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు
ﮢﮣﮤﮥﮦ
37:14 మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు
ﮧﮨﮩﮪﮫﮬﮭ
37:15 మరియు వారిలా అంటారు: ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖ
37:16 ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా
ﯗﯘﯙ
37:17 ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
ﯚﯛﯜﯝﯞ
37:18 వారితో ఇలా అను: అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు
ﯟﯠﯡﯢﯣﯤﯥﯦ
37:19 నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు
ﯧﯨﯩﯪﯫﯬ
37:20 మరియు వారు ఇలా అంటారు: అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
37:21 (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽ
37:22 (దైవదూతలతో ఇలా అనబడుతుంది): ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని
ﯾﯿﰀﰁﰂﰃﰄﰅ
37:23 అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి
ﰆﰇﰈﰉﰊ
37:24 మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
ﭑﭒﭓﭔﭕ
37:25 మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు
ﭖﭗﭘﭙﭚ
37:26 అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు
ﭛﭜﭝﭞﭟﭠ
37:27 మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు
ﭡﭢﭣﭤﭥﭦﭧ
37:28 కొందరు అంటారు: మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు
ﭨﭩﭪﭫﭬﭭ
37:29 ఇతరులు ఇలా జవాబిస్తారు: అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు
ﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹ
37:30 మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁ
37:31 కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము
ﮂﮃﮄﮅﮆ
37:32 కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి
ﮇﮈﮉﮊﮋﮌ
37:33 అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు
ﮍﮎﮏﮐﮑ
37:34 నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము
ﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
37:35 వాస్తవానికి, వారితో: అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు
ﮝﮞﮟﮠﮡﮢﮣ
37:36 మరియు వారు ఇలా అనేవారు: ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా
ﮤﮥﮦﮧﮨﮩ
37:37 వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు
ﮪﮫﮬﮭﮮ
37:38 నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు
ﮯﮰﮱﯓﯔﯕﯖ
37:39 మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు
ﯗﯘﯙﯚﯛ
37:40 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
ﯜﯝﯞﯟﯠ
37:41 అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది
ﯡﯢﯣﯤ
37:42 అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు
ﯥﯦﯧﯨ
37:43 పరమ సుఖాలు గల స్వర్గవనాలలో
ﯩﯪﯫﯬ
37:44 ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
ﯭﯮﯯﯰﯱﯲ
37:45 వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి
ﯳﯴﯵﯶ
37:46 అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది
ﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
37:47 దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు
ﯿﰀﰁﰂﰃ
37:48 మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు
ﰄﰅﰆﰇ
37:49 వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు
ﰈﰉﰊﰋﰌﰍ
37:50 అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు
ﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
37:51 వారిలో ఒకడంటాడు: వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు
ﭑﭒﭓﭔﭕ
37:52 అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
37:53 ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా
ﭞﭟﭠﭡﭢ
37:54 అతడు ఇంకా ఇలా అంటాడు: ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా
ﭣﭤﭥﭦﭧﭨ
37:55 తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు
ﭩﭪﭫﭬﭭﭮ
37:56 అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే
ﭯﭰﭱﭲﭳﭴﭵ
37:57 ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని
ﭶﭷﭸﭹ
37:58 (తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా
ﭺﭻﭼﭽﭾﭿﮀ
37:59 మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా
ﮁﮂﮃﮄﮅﮆ
37:60 నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
ﮇﮈﮉﮊﮋ
37:61 ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి
ﮌﮍﮎﮏﮐﮑﮒ
37:62 ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా
ﮓﮔﮕﮖﮗ
37:63 నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
ﮘﮙﮚﮛﮜﮝﮞ
37:64 నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు
ﮟﮠﮡﮢﮣ
37:65 దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి
ﮤﮥﮦﮧﮨﮩﮪ
37:66 నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓ
37:67 తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది
ﯔﯕﯖﯗﯘﯙ
37:68 ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది
ﯚﯛﯜﯝﯞ
37:69 నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు
ﯟﯠﯡﯢﯣ
37:70 మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని
ﯤﯥﯦﯧﯨﯩ
37:71 మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు
ﯪﯫﯬﯭﯮ
37:72 మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము
ﯯﯰﯱﯲﯳﯴ
37:73 ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో
ﯵﯶﯷﯸﯹ
37:74 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
ﯺﯻﯼﯽﯾﯿ
37:75 మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము
ﰀﰁﰂﰃﰄﰅ
37:76 మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము
ﭑﭒﭓﭔﭕ
37:77 మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము
ﭖﭗﭘﭙﭚ
37:78 మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
ﭛﭜﭝﭞﭟﭠ
37:79 సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)
ﭡﭢﭣﭤﭥ
37:80 నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము
ﭦﭧﭨﭩﭪ
37:81 నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు
ﭫﭬﭭﭮ
37:82 తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
ﭯﭰﭱﭲﭳﭴ
37:83 మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
ﭵﭶﭷﭸﭹﭺ
37:84 అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
ﭻﭼﭽﭾﭿﮀﮁ
37:85 అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు దేనిని ఆరాధిస్తున్నారు
ﮂﮃﮄﮅﮆﮇ
37:86 ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా
ﮈﮉﮊﮋﮌ
37:87 అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి
ﮍﮎﮏﮐﮑ
37:88 ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు
ﮒﮓﮔﮕ
37:89 అప్పుడు అతను ఇలా అన్నాడు: నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు
ﮖﮗﮘﮙ
37:90 కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు
ﮚﮛﮜﮝﮞﮟﮠ
37:91 తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మీరు తినటం లేదేమిటి
ﮡﮢﮣﮤﮥ
37:92 మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు
ﮦﮧﮨﮩﮪ
37:93 తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
ﮫﮬﮭﮮ
37:94 అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు
ﮯﮰﮱﯓﯔ
37:95 అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా
ﯕﯖﯗﯘﯙ
37:96 వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా
ﯚﯛﯜﯝﯞﯟﯠﯡ
37:97 వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి
ﯢﯣﯤﯥﯦﯧ
37:98 కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము
ﯨﯩﯪﯫﯬﯭﯮ
37:99 మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు
ﯯﯰﯱﯲﯳﯴ
37:100 (అతను ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు
ﯵﯶﯷﯸ
37:101 కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము
ﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
37:102 ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు
ﭑﭒﭓﭔﭕ
37:103 ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు
ﭖﭗﭘﭙ
37:104 మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: ఓ ఇబ్రాహీమ్
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
37:105 వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము
ﭣﭤﭥﭦﭧﭨ
37:106 నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష
ﭩﭪﭫﭬ
37:107 మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము
ﭭﭮﭯﭰﭱ
37:108 మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము
ﭲﭳﭴﭵ
37:109 ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)
ﭶﭷﭸﭹ
37:110 ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
ﭺﭻﭼﭽﭾ
37:111 నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు
ﭿﮀﮁﮂﮃﮄ
37:112 మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త
ﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏﮐ
37:113 మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు
ﮑﮒﮓﮔﮕﮖ
37:114 మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము
ﮗﮘﮙﮚﮛﮜ
37:115 మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము
ﮝﮞﮟﮠﮡ
37:116 మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు
ﮢﮣﮤﮥ
37:117 మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము
ﮦﮧﮨﮩ
37:118 మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము
ﮪﮫﮬﮭﮮ
37:119 మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము
ﮯﮰﮱﯓﯔ
37:120 మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)
ﯕﯖﯗﯘﯙ
37:121 నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
ﯚﯛﯜﯝﯞ
37:122 నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు
ﯟﯠﯡﯢﯣ
37:123 మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు
ﯤﯥﯦﯧﯨﯩ
37:124 అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
ﯪﯫﯬﯭﯮﯯ
37:125 ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా
ﯰﯱﯲﯳﯴﯵ
37:126 అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా
ﭑﭒﭓﭔ
37:127 కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు
ﭕﭖﭗﭘﭙ
37:128 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
ﭚﭛﭜﭝﭞ
37:129 తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
ﭟﭠﭡﭢﭣ
37:130 ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)
ﭤﭥﭦﭧﭨ
37:131 నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము
ﭩﭪﭫﭬﭭ
37:132 నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు
ﭮﭯﭰﭱﭲ
37:133 మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు
ﭳﭴﭵﭶﭷ
37:134 ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో
ﭸﭹﭺﭻﭼ
37:135 ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది
ﭽﭾﭿﮀ
37:136 ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము
ﮁﮂﮃﮄﮅ
37:137 మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
ﮆﮇﮈﮉﮊ
37:138 మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
ﮋﮌﮍﮎﮏ
37:139 మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు
ﮐﮑﮒﮓﮔﮕ
37:140 అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
ﮖﮗﮘﮙﮚ
37:141 అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
ﮛﮜﮝﮞﮟ
37:142 ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
ﮠﮡﮢﮣﮤﮥ
37:143 అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే
ﮦﮧﮨﮩﮪﮫﮬ
37:144 దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు
ﮭﮮﮯﮰﮱﯓ
37:145 ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము
ﯔﯕﯖﯗﯘﯙ
37:146 మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము
ﯚﯛﯜﯝﯞﯟﯠ
37:147 మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము
ﯡﯢﯣﯤﯥ
37:148 వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము
ﯦﯧﯨﯩﯪﯫ
37:149 అయితే వారిని ఇలా అడుగు: ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా
ﯬﯭﯮﯯﯰﯱﯲ
37:150 లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా
ﯳﯴﯵﯶﯷﯸ
37:151 అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు
ﯹﯺﯻﯼﯽ
37:152 అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు
ﯾﯿﰀﰁﰂ
37:153 ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా
ﭑﭒﭓﭔﭕ
37:154 మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు
ﭖﭗﭘ
37:155 ఏమీ? మీరు గ్రహించలేరా
ﭙﭚﭛﭜﭝ
37:156 లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా
ﭞﭟﭠﭡﭢﭣ
37:157 మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯ
37:158 మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని
ﭰﭱﭲﭳﭴ
37:159 వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)
ﭵﭶﭷﭸﭹ
37:160 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
ﭺﭻﭼﭽ
37:161 ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)
ﭾﭿﮀﮁﮂ
37:162 ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు
ﮃﮄﮅﮆﮇﮈ
37:163 భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప
ﮉﮊﮋﮌﮍﮎﮏ
37:164 (దైవదూతలు ఇలా అంటారు): మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు
ﮐﮑﮒﮓ
37:165 మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము
ﮔﮕﮖﮗ
37:166 మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే
ﮘﮙﮚﮛ
37:167 మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు
ﮜﮝﮞﮟﮠﮡﮢ
37:168 ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే
ﮣﮤﮥﮦﮧ
37:169 మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము
ﮨﮩﮪﮫﮬﮭ
37:170 కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు
ﮮﮯﮰﮱﯓﯔ
37:171 మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది
ﯕﯖﯗﯘ
37:172 నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
ﯙﯚﯛﯜﯝ
37:173 మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
ﯞﯟﯠﯡﯢ
37:174 కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
ﯣﯤﯥﯦ
37:175 మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
ﯧﯨﯩ
37:176 ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా
ﯪﯫﯬﯭﯮﯯﯰ
37:177 కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు
ﯱﯲﯳﯴﯵ
37:178 కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు
ﯶﯷﯸﯹ
37:179 మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
ﯺﯻﯼﯽﯾﯿﰀ
37:180 నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు
ﰁﰂﰃﰄ
37:181 మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
ﰅﰆﰇﰈﰉ
37:182 మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు

పవిత్ర ఖురాన్


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers