సూరా అస్-సాఫ్ఫాత్ అరబిక్ మరియు తెలుగు

సూరా అస్-సాఫ్ఫాత్ని పూర్తి తెలుగు అనువాదం మరియు ఆడియో తిలావత్‌తో చదవండి. (182 వచనం — مكية). అస్-సాఫ్ఫాత్ వినండి, అస్-సాఫ్ఫాత్ అనువాదం, అస్-సాఫ్ఫాత్ mp3, అస్-సాఫ్ఫాత్ pdf.

సూరా అస్-సాఫ్ఫాత్ చదవండి మరియు వినండి

🎧 వచనం
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالصَّافَّاتِ صَفًّا ۝١
📖 అనువాదం వచనం 1
వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా
فَالزَّاجِرَاتِ زَجْرًا ۝٢
📖 అనువాదం వచనం 2
మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా
فَالتَّالِيَاتِ ذِكْرًا ۝٣
📖 అనువాదం వచనం 3
ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా
إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ ۝٤
📖 అనువాదం వచనం 4
నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే
رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ ۝٥
📖 అనువాదం వచనం 5
ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు
إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ ۝٦
📖 అనువాదం వచనం 6
నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ ۝٧
📖 అనువాదం వచనం 7
మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి
لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ ۝٨
📖 అనువాదం వచనం 8
ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ ۝٩
📖 అనువాదం వచనం 9
(ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది
إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ ۝١٠
📖 అనువాదం వచనం 10
కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది
فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ ۝١١
📖 అనువాదం వచనం 11
అయితే వారిని అడగిండి: ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ ۝١٢
📖 అనువాదం వచనం 12
వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు
وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ ۝١٣
📖 అనువాదం వచనం 13
మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు
وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ ۝١٤
📖 అనువాదం వచనం 14
మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు
وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ ۝١٥
📖 అనువాదం వచనం 15
మరియు వారిలా అంటారు: ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ۝١٦
📖 అనువాదం వచనం 16
ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా
أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ ۝١٧
📖 అనువాదం వచనం 17
ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ ۝١٨
📖 అనువాదం వచనం 18
వారితో ఇలా అను: అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు
فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ ۝١٩
📖 అనువాదం వచనం 19
నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు
وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ ۝٢٠
📖 అనువాదం వచనం 20
మరియు వారు ఇలా అంటారు: అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం
هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ۝٢١
📖 అనువాదం వచనం 21
(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే
۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ ۝٢٢
📖 అనువాదం వచనం 22
(దైవదూతలతో ఇలా అనబడుతుంది): ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని
مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ ۝٢٣
📖 అనువాదం వచనం 23
అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ ۝٢٤
📖 అనువాదం వచనం 24
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ ۝٢٥
📖 అనువాదం వచనం 25
మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు
بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ ۝٢٦
📖 అనువాదం వచనం 26
అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ۝٢٧
📖 అనువాదం వచనం 27
మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు
قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ ۝٢٨
📖 అనువాదం వచనం 28
కొందరు అంటారు: మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు
قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ ۝٢٩
📖 అనువాదం వచనం 29
ఇతరులు ఇలా జవాబిస్తారు: అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ ۝٣٠
📖 అనువాదం వచనం 30
మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ ۝٣١
📖 అనువాదం వచనం 31
కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము
فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ ۝٣٢
📖 అనువాదం వచనం 32
కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ ۝٣٣
📖 అనువాదం వచనం 33
అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ ۝٣٤
📖 అనువాదం వచనం 34
నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము
إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ ۝٣٥
📖 అనువాదం వచనం 35
వాస్తవానికి, వారితో: అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ ۝٣٦
📖 అనువాదం వచనం 36
మరియు వారు ఇలా అనేవారు: ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా
بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ ۝٣٧
📖 అనువాదం వచనం 37
వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు
إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ ۝٣٨
📖 అనువాదం వచనం 38
నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ۝٣٩
📖 అనువాదం వచనం 39
మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝٤٠
📖 అనువాదం వచనం 40
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ ۝٤١
📖 అనువాదం వచనం 41
అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది
فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ ۝٤٢
📖 అనువాదం వచనం 42
అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు
فِي جَنَّاتِ النَّعِيمِ ۝٤٣
📖 అనువాదం వచనం 43
పరమ సుఖాలు గల స్వర్గవనాలలో
عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ ۝٤٤
📖 అనువాదం వచనం 44
ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ ۝٤٥
📖 అనువాదం వచనం 45
వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి
بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ ۝٤٦
📖 అనువాదం వచనం 46
అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ ۝٤٧
📖 అనువాదం వచనం 47
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు
وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ ۝٤٨
📖 అనువాదం వచనం 48
మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ ۝٤٩
📖 అనువాదం వచనం 49
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ ۝٥٠
📖 అనువాదం వచనం 50
అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు
قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ ۝٥١
📖 అనువాదం వచనం 51
వారిలో ఒకడంటాడు: వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు
يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ ۝٥٢
📖 అనువాదం వచనం 52
అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ ۝٥٣
📖 అనువాదం వచనం 53
ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ ۝٥٤
📖 అనువాదం వచనం 54
అతడు ఇంకా ఇలా అంటాడు: ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా
فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ ۝٥٥
📖 అనువాదం వచనం 55
తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు
قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ ۝٥٦
📖 అనువాదం వచనం 56
అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే
وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ ۝٥٧
📖 అనువాదం వచనం 57
ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ ۝٥٨
📖 అనువాదం వచనం 58
(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా
إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ۝٥٩
📖 అనువాదం వచనం 59
మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా
إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ ۝٦٠
📖 అనువాదం వచనం 60
నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ ۝٦١
📖 అనువాదం వచనం 61
ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ ۝٦٢
📖 అనువాదం వచనం 62
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా
إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ ۝٦٣
📖 అనువాదం వచనం 63
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ ۝٦٤
📖 అనువాదం వచనం 64
నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు
طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ ۝٦٥
📖 అనువాదం వచనం 65
దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి
فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ ۝٦٦
📖 అనువాదం వచనం 66
నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ ۝٦٧
📖 అనువాదం వచనం 67
తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ ۝٦٨
📖 అనువాదం వచనం 68
ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది
إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ ۝٦٩
📖 అనువాదం వచనం 69
నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు
فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ ۝٧٠
📖 అనువాదం వచనం 70
మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ ۝٧١
📖 అనువాదం వచనం 71
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ ۝٧٢
📖 అనువాదం వచనం 72
మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము
فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ ۝٧٣
📖 అనువాదం వచనం 73
ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝٧٤
📖 అనువాదం వచనం 74
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ ۝٧٥
📖 అనువాదం వచనం 75
మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము
وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ ۝٧٦
📖 అనువాదం వచనం 76
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము
وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ ۝٧٧
📖 అనువాదం వచనం 77
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ۝٧٨
📖 అనువాదం వచనం 78
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ ۝٧٩
📖 అనువాదం వచనం 79
సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝٨٠
📖 అనువాదం వచనం 80
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ۝٨١
📖 అనువాదం వచనం 81
నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు
ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ ۝٨٢
📖 అనువాదం వచనం 82
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ ۝٨٣
📖 అనువాదం వచనం 83
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ ۝٨٤
📖 అనువాదం వచనం 84
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ ۝٨٥
📖 అనువాదం వచనం 85
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు దేనిని ఆరాధిస్తున్నారు
أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ ۝٨٦
📖 అనువాదం వచనం 86
ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా
فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ ۝٨٧
📖 అనువాదం వచనం 87
అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి
فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ ۝٨٨
📖 అనువాదం వచనం 88
ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు
فَقَالَ إِنِّي سَقِيمٌ ۝٨٩
📖 అనువాదం వచనం 89
అప్పుడు అతను ఇలా అన్నాడు: నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ ۝٩٠
📖 అనువాదం వచనం 90
కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు
فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ ۝٩١
📖 అనువాదం వచనం 91
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మీరు తినటం లేదేమిటి
مَا لَكُمْ لَا تَنطِقُونَ ۝٩٢
📖 అనువాదం వచనం 92
మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ ۝٩٣
📖 అనువాదం వచనం 93
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ ۝٩٤
📖 అనువాదం వచనం 94
అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ ۝٩٥
📖 అనువాదం వచనం 95
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ ۝٩٦
📖 అనువాదం వచనం 96
వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా
قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ ۝٩٧
📖 అనువాదం వచనం 97
వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి
فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ ۝٩٨
📖 అనువాదం వచనం 98
కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము
وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ ۝٩٩
📖 అనువాదం వచనం 99
మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు
رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ ۝١٠٠
📖 అనువాదం వచనం 100
(అతను ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు
فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ ۝١٠١
📖 అనువాదం వచనం 101
కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము
فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ ۝١٠٢
📖 అనువాదం వచనం 102
ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు
فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ ۝١٠٣
📖 అనువాదం వచనం 103
ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు
وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ ۝١٠٤
📖 అనువాదం వచనం 104
మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: ఓ ఇబ్రాహీమ్
قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١٠٥
📖 అనువాదం వచనం 105
వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము
إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ ۝١٠٦
📖 అనువాదం వచనం 106
నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష
وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ ۝١٠٧
📖 అనువాదం వచనం 107
మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ۝١٠٨
📖 అనువాదం వచనం 108
మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము
سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ ۝١٠٩
📖 అనువాదం వచనం 109
ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)
كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١١٠
📖 అనువాదం వచనం 110
ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ۝١١١
📖 అనువాదం వచనం 111
నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు
وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ ۝١١٢
📖 అనువాదం వచనం 112
మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త
وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ ۝١١٣
📖 అనువాదం వచనం 113
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ۝١١٤
📖 అనువాదం వచనం 114
మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము
وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ ۝١١٥
📖 అనువాదం వచనం 115
మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము
وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ ۝١١٦
📖 అనువాదం వచనం 116
మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు
وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ ۝١١٧
📖 అనువాదం వచనం 117
మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము
وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ۝١١٨
📖 అనువాదం వచనం 118
మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము
وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ ۝١١٩
📖 అనువాదం వచనం 119
మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము
سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ۝١٢٠
📖 అనువాదం వచనం 120
మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١٢١
📖 అనువాదం వచనం 121
నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ۝١٢٢
📖 అనువాదం వచనం 122
నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ ۝١٢٣
📖 అనువాదం వచనం 123
మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు
إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ ۝١٢٤
📖 అనువాదం వచనం 124
అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ ۝١٢٥
📖 అనువాదం వచనం 125
ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా
اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ ۝١٢٦
📖 అనువాదం వచనం 126
అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ ۝١٢٧
📖 అనువాదం వచనం 127
కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝١٢٨
📖 అనువాదం వచనం 128
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ ۝١٢٩
📖 అనువాదం వచనం 129
తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ ۝١٣٠
📖 అనువాదం వచనం 130
ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١٣١
📖 అనువాదం వచనం 131
నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము
إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ ۝١٣٢
📖 అనువాదం వచనం 132
నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు
وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ ۝١٣٣
📖 అనువాదం వచనం 133
మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు
إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ ۝١٣٤
📖 అనువాదం వచనం 134
ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో
إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ ۝١٣٥
📖 అనువాదం వచనం 135
ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ۝١٣٦
📖 అనువాదం వచనం 136
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ ۝١٣٧
📖 అనువాదం వచనం 137
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ ۝١٣٨
📖 అనువాదం వచనం 138
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ ۝١٣٩
📖 అనువాదం వచనం 139
మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు
إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ ۝١٤٠
📖 అనువాదం వచనం 140
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ ۝١٤١
📖 అనువాదం వచనం 141
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ ۝١٤٢
📖 అనువాదం వచనం 142
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ ۝١٤٣
📖 అనువాదం వచనం 143
అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే
لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ۝١٤٤
📖 అనువాదం వచనం 144
దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు
۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ ۝١٤٥
📖 అనువాదం వచనం 145
ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము
وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ ۝١٤٦
📖 అనువాదం వచనం 146
మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ ۝١٤٧
📖 అనువాదం వచనం 147
మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము
فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ ۝١٤٨
📖 అనువాదం వచనం 148
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము
فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ ۝١٤٩
📖 అనువాదం వచనం 149
అయితే వారిని ఇలా అడుగు: ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా
أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ ۝١٥٠
📖 అనువాదం వచనం 150
లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా
أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ ۝١٥١
📖 అనువాదం వచనం 151
అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు
وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ ۝١٥٢
📖 అనువాదం వచనం 152
అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు
أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ ۝١٥٣
📖 అనువాదం వచనం 153
ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ۝١٥٤
📖 అనువాదం వచనం 154
మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు
أَفَلَا تَذَكَّرُونَ ۝١٥٥
📖 అనువాదం వచనం 155
ఏమీ? మీరు గ్రహించలేరా
أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ ۝١٥٦
📖 అనువాదం వచనం 156
లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా
فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ۝١٥٧
📖 అనువాదం వచనం 157
మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి
وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ ۝١٥٨
📖 అనువాదం వచనం 158
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని
سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ ۝١٥٩
📖 అనువాదం వచనం 159
వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)
إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝١٦٠
📖 అనువాదం వచనం 160
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ ۝١٦١
📖 అనువాదం వచనం 161
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)
مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ ۝١٦٢
📖 అనువాదం వచనం 162
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు
إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ ۝١٦٣
📖 అనువాదం వచనం 163
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప
وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ ۝١٦٤
📖 అనువాదం వచనం 164
(దైవదూతలు ఇలా అంటారు): మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు
وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ ۝١٦٥
📖 అనువాదం వచనం 165
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము
وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ ۝١٦٦
📖 అనువాదం వచనం 166
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే
وَإِن كَانُوا لَيَقُولُونَ ۝١٦٧
📖 అనువాదం వచనం 167
మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ ۝١٦٨
📖 అనువాదం వచనం 168
ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే
لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ ۝١٦٩
📖 అనువాదం వచనం 169
మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము
فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ ۝١٧٠
📖 అనువాదం వచనం 170
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ ۝١٧١
📖 అనువాదం వచనం 171
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది
إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ ۝١٧٢
📖 అనువాదం వచనం 172
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ ۝١٧٣
📖 అనువాదం వచనం 173
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ۝١٧٤
📖 అనువాదం వచనం 174
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ ۝١٧٥
📖 అనువాదం వచనం 175
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ۝١٧٦
📖 అనువాదం వచనం 176
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ ۝١٧٧
📖 అనువాదం వచనం 177
కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ۝١٧٨
📖 అనువాదం వచనం 178
కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ ۝١٧٩
📖 అనువాదం వచనం 179
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ ۝١٨٠
📖 అనువాదం వచనం 180
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు
وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ ۝١٨١
📖 అనువాదం వచనం 181
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ۝١٨٢
📖 అనువాదం వచనం 182
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు
← 36 అస్-సాఫ్ఫాత్ (37/114) 38 →
చదవండి సూరా అస్-సాఫ్ఫాత్ తెలుగు అనువాదం – పఠనం మరియు ఆడియో

37الصافات As-Saffat 📚 182 వచనం مكية

వచనానికి వచనం – సూరా అస్-సాఫ్ఫాత్ — 182 వచనం




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers