Wa lammaa jaaa`ahum Kitaabum min `indil laahi musaddiqul limaa ma`ahum wa kaanoo min qablu yastaftihoona `alal lazeena kafaroo falammaa jaaa`ahum maa `arafoo kafaroo bih; fala `natul laahi `alal kaafireen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
और जब उनके पास खुदा की तरफ़ से किताब (कुरान आई और वह उस किताब तौरेत) की जो उन के पास तसदीक़ भी करती है। और उससे पहले (इसकी उम्मीद पर) काफ़िरों पर फतेहयाब होने की दुआएँ माँगते थे पस जब उनके पास वह चीज़ जिसे पहचानते थे आ गई तो लगे इन्कार करने पस काफ़िरों पर खुदा की लानत है
يَسْتَفْتِحُونَ (యస్తఫ్తిహూన్): వారు విజయం కోరేవారు, సహాయం అడిగేవారు.
مُصَدِّقٌ (ముసద్దిఖ్): ధృవీకరించేది, సమర్థించేది.
فَلَعْنَةُ اللَّهِ (ఫలఅ్నతుల్లాహ్): అల్లాహ్ శాపం, అల్లాహ్ కరుణ నుండి దూరం చేయడం.
ఆయత్ వ్యాఖ్యానం:
అల్లాహ్ తరఫు నుండి వారి వద్ద ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవీకరిస్తూ ఒక గ్రంథం (ఖుర్ఆన్) వచ్చినప్పుడు, వారు దానిని తిరస్కరించారు. వాస్తవానికి వారు ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాకకు ముందు, అవిశ్వాసులపై విజయం కోసం ఆయన ద్వారా సహాయం అడుగుతూ ఉండేవారు. "మా పైకి ఒక ప్రవక్త వస్తే మేము ఆయనను అనుసరిస్తాము, మీపై విజయం సాధిస్తాము" అని వారు చెప్పుకునేవారు. కానీ వారు గుర్తించిన ఆ ప్రవక్త వచ్చినప్పుడు, వారు అతనిని తిరస్కరించారు. దీనికి కారణం అసూయ మరియు అహంకారం. అందుకే అల్లాహ్ శాపం అవిశ్వాసులపై ఉంటుంది.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
ఖుర్ఆన్ మునుపటి గ్రంథాలను ధృవీకరిస్తుంది, ఇది దాని సత్యత్వానికి నిదర్శనం.
అసూయ మరియు అహంకారం మనిషిని సత్యాన్ని తిరస్కరించేలా చేస్తాయి.
అల్లాహ్ వాగ్దానం నెరవేరుతుంది, కానీ దానిని గుర్తించి స్వీకరించడం మన బాధ్యత.
హృదయం స్వచ్ఛంగా ఉంచుకోవడం, సత్యాన్ని అంగీకరించడం ఇస్లాంలో ముఖ్యమైన విలువ.
అల్లాహ్ శాపం నుండి రక్షణ పొందాలంటే విశ్వాసం మరియు సత్యానుసరణ అవసరం.
మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది
మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము. ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు
మరియు వారు: మా హృదయాలు మూయబడి ఉన్నాయి."అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్యతిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ
మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది
అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్ /ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్ష వల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష ఉంది
మరియు వారితో (యూదులతో): అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, వారు: మా (ఇస్రాయీల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వసిస్తాము." అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ముహమ్మద్) వారిని అడుగు: మీరు (మీ వద్దనున్న గ్రంథాన్ని) విశ్వసించే వారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.