Yaaa aiyuhar Rasoolu balligh maaa unzila ilaika mir Rabbika wa il lam taf`al famaaa ballaghta Risaalatah; wallaahu ya`simuka minan naas; innal laaha laa yahdil qawmal kaafireen
📖 అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు
🌐 Additional reference in हिन्दी
🌐 हिन्दी
ऐ रसूल जो हुक्म तुम्हारे परवरदिगार की तरफ़ से तुम पर नाज़िल किया गया है पहुंचा दो और अगर तुमने ऐसा न किया तो (समझ लो कि) तुमने उसका कोई पैग़ाम ही नहीं पहुंचाया और (तुम डरो नहीं) ख़ुदा तुमको लोगों के श्शर से महफ़ूज़ रखेगा ख़ुदा हरगिज़ काफ़िरों की क़ौम को मंज़िले मक़सूद तक नहीं पहुंचाता
ఓ ప్రవక్తా! నీ ప్రభువు (అల్లాహ్) నీపై అవతరింపజేసిన సమస్త దైవవాణిని ప్రజలకు పూర్తిగా అందజెయ్యి. అందులో ఏ భాగాన్నీ దాచకు, ఏ విషయాన్నీ విడిచిపెట్టకు. ఒకవేళ నీవు ఏదైనా దాచినా లేదా అందజేయకుండా విడిచిపెట్టినా, అప్పుడు నీవు అల్లాహ్ సందేశాన్ని అందజేసినవాడవు కావు. ఎందుకంటే సందేశంలోని కొంత భాగాన్ని దాచడం అనేది మొత్తం సందేశాన్ని నష్టపరచడమే. కాబట్టి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆదేశించిన ప్రతిదాన్నీ పూర్తిగా అందజేశారు. ఎవరైనా ఆయన ఏదైనా దాచారని చెప్పినట్లయితే, వారు అల్లాహ్ మీదా, ఆయన ప్రవక్త మీదా పెద్ద అపవాదు మోపినవారవుతారు.
అల్లాహ్ నిన్ను ప్రజల నుండి కాపాడతాడు. శత్రువులు నీకు ఎటువంటి హాని చేయలేరు, నిన్ను చంపలేరు, నీకు ఏ బాధనూ కలిగించలేరు. నీ పని కేవలం సందేశాన్ని అందజేయడం మాత్రమే; రక్షణ అల్లాహ్ చేతిలో ఉంది. నిశ్చయంగా అల్లాహ్ సత్యాన్ని తిరస్కరించే ప్రజలను సన్మార్గంలోకి నడిపించడు. వారు హితబోధను స్వీకరించడానికి ఇష్టపడని వారు, కాబట్టి వారు సన్మార్గాన్ని పొందలేరు.
ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:
సందేశాన్ని పూర్తిగా అందజేయడం: ఇస్లాం సందేశాన్ని ఎటువంటి లోపం లేకుండా, ఏ భాగాన్నీ దాచకుండా పూర్తిగా అందజేయాలని ఈ ఆయత్ బోధిస్తుంది. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల అల్లాహ్ ఉంచిన గొప్ప బాధ్యతను చూపిస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ పూర్తిత్వం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ సందేశాన్ని పూర్తిగా అందజేశారని, ఏదీ దాచలేదని ఈ ఆయత్ స్పష్టం చేస్తుంది. ఇది విశ్వాసుల హృదయాలకు ధైర్యాన్నిస్తుంది.
అల్లాహ్ రక్షణ: అల్లాహ్ తన ప్రవక్తను ప్రజల నుండి కాపాడతాడని ఈ ఆయత్ తెలుపుతుంది. అల్లాహ్ తన దూతలను, సత్యాన్ని విశ్వసించేవారిని ఎప్పుడూ రక్షిస్తాడని ఇది భరోసా ఇస్తుంది.
సత్యాన్ని తిరస్కరించేవారికి మార్గదర్శకత్వం లేదు: అల్లాహ్ అవిశ్వాసులను సన్మార్గ
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు
మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము
మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు. వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు. కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు
ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు
నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు సాబీయూలు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా
SurahQuran.com was founded as a humble effort to serve the Noble Book and the pure Sunnah, to invite people to Allah, and to make the religious sciences accessible according to the methodology of the Quran and Sunnah. We praise and thank Allah for His grace, and we ask Him to accept our work and make it sincere for His noble Face.