అల్-బఖరా · 33/286
అనువాదం ఉచ్చారణ — అల్-బఖరా
قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ ۝٣٣
Qaala yaaa Aadamu ambi` hum biasmaaa`ihimfalammaaa amba ahum bi asmaaa`ihim qaala alam aqul lakum inneee a`lamu ghaibas samaawaati wal ardi wa a`lamu maa tubdoona wa maa kuntum taktumoon
📖 తెలుగులో
ఆయన (అల్లాహ్): ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు
🎧 వినండి

📜 వచనం 31-35 — అల్-బఖరా

31وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు
32قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
వారు (దేవదూతలు): నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు
33قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ
ఆయన (అల్లాహ్): ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు
34وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు
35وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు
అల్-బఖరాఖురాన్ సూచిక
286వచనం
MedinanRevelation
33వచనం

అనువాదం — అల్-బఖరా 33

సూరా అల్-బఖరా వచనం 33 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆయన (అల్లాహ్): ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు."…

సూరా వచనం 33/286 — అల్-బఖరా البقرة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-బఖరా వినండి, అల్-బఖరా అనువాదం, అల్-బఖరా mp3, అల్-బఖరా pdf. వచనం 31–35. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers