అత్-తౌబా · 59/129
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తౌబా
وَلَوْ أَنَّهُمْ رَضُوا مَا آتَاهُمُ اللَّهُ وَرَسُولُهُ وَقَالُوا حَسْبُنَا اللَّهُ سَيُؤْتِينَا اللَّهُ مِن فَضْلِهِ وَرَسُولُهُ إِنَّا إِلَى اللَّهِ رَاغِبُونَ ۝٥٩
Wa law annahum radoo maaa aataahumul laahu wa Rasooluhoo wa qaaloo hasbunal laahu wayu`teenallaahu min fadlihee wa Rasooluhooo innaaa ilallaahi raaghiboon
📖 తెలుగులో
మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00
📜

అనువాదం — Tafsir

పదాల అర్థాలు:

  • رَضُوا: వారు సంతృప్తి చెందారు, సమ్మతించారు.
  • آتَاهُمُ: ఆయన వారికి ఇచ్చినది.
  • حَسْبُنَا اللَّهُ: అల్లాహ్ మాకు చాలు, ఆయనే మా అవసరాలను తీర్చేవాడు.
  • فَضْلِهِ: ఆయన అనుగ్రహం, దయ.
  • رَاغِبُونَ: కోరుకునేవారు, ఆశించేవారు, మొగ్గు చూపేవారు.

ఆయత్ వ్యాఖ్యానం:

ఈ ఆయత్ కపట విశ్వాసుల (మునాఫికూన్) గురించి మాట్లాడుతోంది. వారు ప్రవక్త ﷺ జకాత్ (దానధర్మాల) పంపిణీలో తమకు తక్కువ ఇచ్చారని నిందించేవారు, అసంతృప్తి చెందేవారు. అల్లాహ్ వారికి ఇలా హితబోధ చేస్తున్నాడు: ఒకవేళ వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో సంతృప్తి చెంది, "అల్లాహ్ మాకు చాలు, ఆయన తన అనుగ్రహం నుండి మాకు ఇస్తాడు, ఆయన ప్రవక్త కూడా ఇస్తాడు, మేము అల్లాహ్ వైపే మొగ్గు చూపుతున్నాము, ఆయనే మా ఆశాకేంద్రుడు" అని అన్నట్లయితే — అది వారికి చాలా మంచిది అయ్యేది.

అంటే, వారు ప్రవక్తను నిందించడం, అసంతృప్తి చెందడం కంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో సంతోషించి, అల్లాహ్ పైనే ఆధారపడి, ఆయన అనుగ్రహం కోసం ఆశించడం వారికి ఎంతో శ్రేయస్కరమైనది. ఎందుకంటే అల్లాహ్ తన దయతో వారికి ఇంకా ఎక్కువ ఇవ్వగలడు, ప్రవక్త ద్వారా కూడా ఇప్పించగలడు. నిజమైన విశ్వాసి ఎప్పుడూ అల్లాహ్ వైపే తన ఆశలను, కోరికలను మళ్ళిస్తాడు — ఆయన అనుగ్రహం నుండి మాత్రమే మేలు కలుగుతుందని నమ్ముతాడు.


ఈ ఆయత్ నుండి పొందే ప్రయోజనాలు:

  1. సంతృప్తి (రిదా) ఒక గొప్ప సద్గుణం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో సంతృప్తి చెందడం విశ్వాసి లక్షణం. ఇది మనస్సుకు ప్రశాంతతను, హృదయానికి శాంతిని ఇస్తుంది.
  2. అల్లాహ్ పైనే ఆధారపడడం (తవక్కుల్): "అల్లాహ్ మాకు చాలు" అని చెప్పడం అంటే — అన్ని పరిస్థితుల్లో అల్లాహ్ పైనే నమ్మకం ఉంచడం. ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వం ఇచ్చేవాడు.
  3. ఆశ మరియు కోరిక అల్లాహ్ వైపే ఉండాలి: నిజమైన విశ్వాసి తన కోరికలను, ఆశలను అల్లాహ్ వైపే మళ్ళిస్తాడు. ప్రజలను, వస్తువులను కాదు. ఇది విశ్వాసిని ఆత్మగౌరవంతో, స్వాభిమానంతో జీవించేలా చేస్తుంది.
  4. ఫిర్యాదు మరియు అసంతృప్తి వదిలేయడం: ఇతరులను నిందించడం, ఫిర్యాదు చేయడం వల్ల ఎటువంటి మేలు జరగదు. బదులుగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచి, ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించడం ఉత్తమ మార్గం.
  5. ఇస్లాం సౌందర్యం: ఇస్లాం మనిషిని సంతృప్తి, కృతజ్ఞత, మరియు అల్లాహ్ పైనే ఆధారపడే గుణాల వైపు నడిపిస్తుంది. ఇది మనిషి జీవితాన్ని సుఖశాంతులతో న


📜 వచనం 57-61 — సూరా అత్-తౌబా

57لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ
ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు
58وَمِنْهُم مَّن يَلْمِزُكَ فِي الصَّدَقَاتِ فَإِنْ أُعْطُوا مِنْهَا رَضُوا وَإِن لَّمْ يُعْطَوْا مِنْهَا إِذَا هُمْ يَسْخَطُونَ
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు
59وَلَوْ أَنَّهُمْ رَضُوا مَا آتَاهُمُ اللَّهُ وَرَسُولُهُ وَقَالُوا حَسْبُنَا اللَّهُ سَيُؤْتِينَا اللَّهُ مِن فَضْلِهِ وَرَسُولُهُ إِنَّا إِلَى اللَّهِ رَاغِبُونَ
మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది)
60۞ إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
నిశ్చయంగా దానాలు (సదఖాలు) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
61وَمِنْهُمُ الَّذِينَ يُؤْذُونَ النَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٌ ۚ قُلْ أُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِّلَّذِينَ آمَنُوا مِنكُمْ ۚ وَالَّذِينَ يُؤْذُونَ رَسُولَ اللَّهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: ఇతను (చెప్పుడు మాటలు వినేవాడు." ఇలా అను: అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్ ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి." మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది)
అత్-తౌబాఖురాన్ సూచిక
129వచనం
MedinanRevelation
59వచనం

అనువాదం — అత్-తౌబా 59

సూరా అత్-తౌబా వచనం 59 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు…

సూరా వచనం 59/129 — సూరా అత్-తౌబా التوبة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తౌబా వినండి, సూరా అత్-తౌబా అనువాదం, సూరా అత్-తౌబా mp3, సూరా అత్-తౌబా pdf. వచనం 57–61. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Sunday, October 18, 2026

Don't forget us in your sincere prayers