అల్-అన్ఆమ్ · 76/165
అనువాదం ఉచ్చారణ — అల్-అన్ఆమ్
فَلَمَّا جَنَّ عَلَيۡهِ ٱلَّيۡلُ رَءَا كَوۡكَبًاۖ قَالَ هَٰذَا رَبِّيۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَآ أُحِبُّ ٱلۡأٓفِلِينَ  ۝٧٦
Falammaa janna `alaihil lailu ra aa kawkabaan qaala haaza Rabbee falammaaa afala qaala laaa uhibbul aafileen
📖 తెలుగులో
ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: అస్తమించే వాటిని నేను ప్రేమించను!" అని అన్నాడు
🎧 వినండి

📜 వచనం 74-78 — అల్-అన్ఆమ్

74۞ وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ ءَازَرَ أَتَتَّخِذُ أَصۡنَامًا ءَالِهَةً إِنِّيٓ أَرَىٰكَ وَقَوۡمَكَ فِي ضَلَٰلٍ مُّبِينٍ 
(జ్ఞాపకం చేసుకోండి!) ఇబ్రాహీమ్ తన తండ్రి ఆజర్ తో ఇలా అన్న విషయం: ఏమీ? నీవు విగ్రహాలను ఆరాధ్యదైవాలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను మరియు నీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్న వారిగా చూస్తున్నాను
75وَكَذَٰلِكَ نُرِيٓ إِبۡرَٰهِيمَ مَلَكُوتَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلِيَكُونَ مِنَ ٱلۡمُوقِنِينَ 
మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము
76فَلَمَّا جَنَّ عَلَيۡهِ ٱلَّيۡلُ رَءَا كَوۡكَبًاۖ قَالَ هَٰذَا رَبِّيۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَآ أُحِبُّ ٱلۡأٓفِلِينَ 
ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: అస్తమించే వాటిని నేను ప్రేమించను!" అని అన్నాడు
77فَلَمَّا رَءَا ٱلۡقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّيۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَئِن لَّمۡ يَهۡدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ ٱلۡقَوۡمِ ٱلضَّآلِّينَ 
ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని అది అస్తమించగానే, ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరి పోయేవాడను!"అని అన్నాడు
78فَلَمَّا رَءَا ٱلشَّمۡسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَآ أَكۡبَرُۖ فَلَمَّآ أَفَلَتۡ قَالَ يَٰقَوۡمِ إِنِّي بَرِيٓءٌ مِّمَّا تُشۡرِكُونَ 
ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!" అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే: ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వామ్యము) కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు!" అని అన్నాడు
అల్-అన్ఆమ్ఖురాన్ సూచిక
165వచనం
MeccanRevelation
76వచనం

అనువాదం — అల్-అన్ఆమ్ 76

సూరా వచనం 76/165 — అల్-అన్ఆమ్ الأنعام (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-అన్ఆమ్ వినండి, అల్-అన్ఆమ్ అనువాదం, అల్-అన్ఆమ్ mp3, అల్-అన్ఆమ్ pdf. వచనం 74–78. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers