సబా · 25/54
అనువాదం ఉచ్చారణ — సబా
قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ ۝٢٥
Qul laa tus`aloona `ammaaa ajramnaa wa laa nus`alu `ammaa ta`maloon
📖 తెలుగులో
ఇంకా ఇలా అను: మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము
🎧 వినండి

📜 వచనం 23-27 — సబా

23وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ
మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)! చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవతలు): మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు
24۞ قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُلِ اللَّهُ ۖ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَىٰ هُدًى أَوْ فِي ضَلَالٍ مُّبِينٍ
వారిని ఇలా అడుగు: మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి తెలుపు: అల్లాహ్!" అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము
25قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ
ఇంకా ఇలా అను: మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము
26قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ
వారితో ఇలా అను: మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు
27قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُم بِهِ شُرَكَاءَ ۖ كَلَّا ۚ بَلْ هُوَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
వారితో ఇలా అను: మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు! వాస్తవానికి ఆయన, అల్లాహ్ యే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు
సబాఖురాన్ సూచిక
54వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — సబా 25

సూరా సబా వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇంకా ఇలా అను: మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ…

సూరా వచనం 25/54 — సబా سبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సబా వినండి, సబా అనువాదం, సబా mp3, సబా pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers