అల్-అంబియా · 75/112
అనువాదం ఉచ్చారణ — అల్-అంబియా
وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُ مِنَ الصَّالِحِينَ ۝٧٥
Wa adkhalnaahu fee rahmatinaa innahoo minas saalihee
📖 తెలుగులో
మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు
🎧 వినండి

📜 వచనం 73-77 — అల్-అంబియా

73وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَا إِلَيْهِمْ فِعْلَ الْخَيْرَاتِ وَإِقَامَ الصَّلَاةِ وَإِيتَاءَ الزَّكَاةِ ۖ وَكَانُوا لَنَا عَابِدِينَ
మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు
74وَلُوطًا آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَاهُ مِنَ الْقَرْيَةِ الَّتِي كَانَت تَّعْمَلُ الْخَبَائِثَ ۗ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَاسِقِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు
75وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُ مِنَ الصَّالِحِينَ
మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు
76وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము
77وَنَصَرْنَاهُ مِنَ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ
మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచి వేశాము
అల్-అంబియాఖురాన్ సూచిక
112వచనం
MeccanRevelation
75వచనం

అనువాదం — అల్-అంబియా 75

సూరా అల్-అంబియా వచనం 75 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని…

సూరా వచనం 75/112 — అల్-అంబియా الأنبياء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-అంబియా వినండి, అల్-అంబియా అనువాదం, అల్-అంబియా mp3, అల్-అంబియా pdf. వచనం 73–77. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers