అల్-మాఇదా · 62/120
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మాఇదా
وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ ۝٦٢
Wa taraa kaseeram minhum yusaari`oona fil ismi wal`udwaani wa aklihimus suht; labi`sa maa kaanoo ya`maloon
📖 తెలుగులో
మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిద్ధమైనవి తినటానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 60-64 — సూరా అల్-మాఇదా

60قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ
ఇలా అను: ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే
61وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
మరియు వారు (కపట విశ్వాసులు) నీ వద్దకు వచ్చినప్పుడు: మేము విశ్వసించాము." అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారంతోనే వస్తారు మరియు దాని (సత్యతిరస్కారం) తోనే తిరిగి పోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు
62وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిద్ధమైనవి తినటానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి
63لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిద్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి
64وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
మరియు యూదులు: అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడి ఉన్నాయి." అని అంటారు. వారి చేతులకే సంకెళ్ళు వేయబడుగాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చు చేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్య తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించే వారిని ప్రేమించడు
అల్-మాఇదాఖురాన్ సూచిక
120వచనం
MedinanRevelation
62వచనం

అనువాదం — అల్-మాఇదా 62

సూరా అల్-మాఇదా వచనం 62 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిద్ధమైనవి తినటానికి…

సూరా వచనం 62/120 — సూరా అల్-మాఇదా المائدة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మాఇదా వినండి, సూరా అల్-మాఇదా అనువాదం, సూరా అల్-మాఇదా mp3, సూరా అల్-మాఇదా pdf. వచనం 60–64. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers