అల్-మాఇదా · 90/120
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మాఇదా
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۝٩٠
yaaa aiyuhal lazeena aamanooo innamal khamru walmaisiru wal ansaabu wal azlaamu rijsum min `amalish shaitaani fajtaniboohu la`al lakum tuflihoon
📖 తెలుగులో
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 88-92 — సూరా అల్-మాఇదా

88وَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ
మరియు అల్లాహ్ మీకు జీవనోపాధిగా ప్రసాదించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి
89لَا يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ الْأَيْمَانَ ۖ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَاحْفَظُوا أَيْمَانَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తి లేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా). మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు
90يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి
91إِنَّمَا يُرِيدُ الشَّيْطَانُ أَن يُوقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ فِي الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَن ذِكْرِ اللَّهِ وَعَنِ الصَّلَاةِ ۖ فَهَلْ أَنتُم مُّنتَهُونَ
నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా
92وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِن تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
మరియు మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి
అల్-మాఇదాఖురాన్ సూచిక
120వచనం
MedinanRevelation
90వచనం

అనువాదం — అల్-మాఇదా 90

సూరా అల్-మాఇదా వచనం 90 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్)…

సూరా వచనం 90/120 — సూరా అల్-మాఇదా المائدة (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మాఇదా వినండి, సూరా అల్-మాఇదా అనువాదం, సూరా అల్-మాఇదా mp3, సూరా అల్-మాఇదా pdf. వచనం 88–92. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers