La sourate Al-Balad en Telugu
కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను) |
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది |
మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా |
వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము |
ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా |
అతడు: నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు |
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా |
ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా |
మరియు నాలుకను మరియు రెండు పెదవులను |
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము |
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు |
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా |
فَكُّ رَقَبَةٍ(13) అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం |
లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం |
సమీప అనాథునికి గానీ |
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ |
ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ(17) మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం |
ఇలాంటి వారే కుడిపక్షం వారు |
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ(19) ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు |
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Balad : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Balad complète en haute qualité.
Ahmed Al Ajmy Bandar Balila Khalid Al Jalil Saad Al Ghamdi Saud Al Shuraim Abdul Basit Abdul Rashid Sufi Abdullah Basfar Abdullah Al Juhani Fares Abbad Maher Al Muaiqly Al Minshawi Al Hosary Mishari Al-afasi Yasser Al Dosari
Donnez-nous une invitation valide