Saffat suresi çevirisi Telugu

  1. Suresi mp3
  2. Başka bir sure
  3. Telugu
Kuranı Kerim türkçe meali | Kur'an çevirileri | Telugu dili | Saffat Suresi | الصافات - Ayet sayısı 182 - Moshaf'taki surenin numarası: 37 - surenin ingilizce anlamı: Those Who Set The Ranks.

وَالصَّافَّاتِ صَفًّا(1)

 వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా

فَالزَّاجِرَاتِ زَجْرًا(2)

 మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా

فَالتَّالِيَاتِ ذِكْرًا(3)

 ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా

إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ(4)

 నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే

رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ(5)

 ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు

إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ(6)

 నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము

وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ(7)

 మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి

لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ(8)

 ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు

دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ(9)

 (ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది

إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ(10)

 కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది

فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ(11)

 అయితే వారిని అడగిండి: ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము

بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ(12)

 వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు

وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ(13)

 మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు

وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ(14)

 మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు

وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ(15)

 మరియు వారిలా అంటారు: ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే

أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ(16)

 ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా

أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ(17)

 ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా

قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ(18)

 వారితో ఇలా అను: అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు

فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ(19)

 నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు

وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ(20)

 మరియు వారు ఇలా అంటారు: అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం

هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ(21)

 (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే

۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ(22)

 (దైవదూతలతో ఇలా అనబడుతుంది): ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని

مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ(23)

 అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి

وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ(24)

 మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది

مَا لَكُمْ لَا تَنَاصَرُونَ(25)

 మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు

بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ(26)

 అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు

وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ(27)

 మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు

قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ(28)

 కొందరు అంటారు: మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు

قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ(29)

 ఇతరులు ఇలా జవాబిస్తారు: అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు

وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ(30)

 మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు

فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ(31)

 కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము

فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ(32)

 కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి

فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ(33)

 అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు

إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ(34)

 నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము

إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ(35)

 వాస్తవానికి, వారితో: అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు

وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ(36)

 మరియు వారు ఇలా అనేవారు: ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా

بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ(37)

 వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు

إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ(38)

 నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు

وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ(39)

 మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు

إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ(40)

 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప

أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ(41)

 అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది

فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ(42)

 అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు

فِي جَنَّاتِ النَّعِيمِ(43)

 పరమ సుఖాలు గల స్వర్గవనాలలో

عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ(44)

 ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు

يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ(45)

 వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి

بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ(46)

 అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది

لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ(47)

 దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు

وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ(48)

 మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు

كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ(49)

 వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ(50)

 అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు

قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ(51)

 వారిలో ఒకడంటాడు: వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు

يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ(52)

 అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా

أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ(53)

 ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా

قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ(54)

 అతడు ఇంకా ఇలా అంటాడు: ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా

فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ(55)

 తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు

قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ(56)

 అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే

وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ(57)

 ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని

أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ(58)

 (తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా

إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ(59)

 మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా

إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ(60)

 నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)

لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ(61)

 ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి

أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ(62)

 ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా

إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ(63)

 నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము

إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ(64)

 నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు

طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ(65)

 దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి

فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ(66)

 నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు

ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ(67)

 తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది

ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ(68)

 ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది

إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ(69)

 నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు

فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ(70)

 మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని

وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ(71)

 మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు

وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ(72)

 మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము

فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ(73)

 ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో

إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ(74)

 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప

وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ(75)

 మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము

وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ(76)

 మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము

وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ(77)

 మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము

وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ(78)

 మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము

سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ(79)

 సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)

إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(80)

 నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము

إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ(81)

 నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు

ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ(82)

 తరువాత మేము ఇతరులను ముంచి వేశాము

۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ(83)

 మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు

إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ(84)

 అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ(85)

 అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు దేనిని ఆరాధిస్తున్నారు

أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ(86)

 ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా

فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ(87)

 అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి

فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ(88)

 ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు

فَقَالَ إِنِّي سَقِيمٌ(89)

 అప్పుడు అతను ఇలా అన్నాడు: నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు

فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ(90)

 కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు

فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ(91)

 తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మీరు తినటం లేదేమిటి

مَا لَكُمْ لَا تَنطِقُونَ(92)

 మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు

فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ(93)

 తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు

فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ(94)

 అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు

قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ(95)

 అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ(96)

 వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా

قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ(97)

 వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి

فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ(98)

 కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము

وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ(99)

 మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు

رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ(100)

 (అతను ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు

فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ(101)

 కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము

فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ(102)

 ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు

فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ(103)

 ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు

وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ(104)

 మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: ఓ ఇబ్రాహీమ్

قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(105)

 వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము

إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ(106)

 నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష

وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ(107)

 మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము

وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ(108)

 మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము

سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ(109)

 ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)

كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(110)

 ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము

إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ(111)

 నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు

وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ(112)

 మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త

وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ(113)

 మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు

وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ(114)

 మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము

وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ(115)

 మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము

وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ(116)

 మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు

وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ(117)

 మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము

وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ(118)

 మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము

وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ(119)

 మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము

سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ(120)

 మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)

إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(121)

 నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము

إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ(122)

 నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు

وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ(123)

 మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు

إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ(124)

 అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా

أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ(125)

 ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా

اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ(126)

 అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా

فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ(127)

 కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు

إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ(128)

 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప

وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ(129)

 తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము

سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ(130)

 ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)

إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ(131)

 నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము

إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ(132)

 నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు

وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ(133)

 మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు

إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ(134)

 ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో

إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ(135)

 ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది

ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ(136)

 ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము

وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ(137)

 మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు

وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ(138)

 మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా

وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ(139)

 మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు

إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ(140)

 అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు

فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ(141)

 అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు

فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ(142)

 ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు

فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ(143)

 అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే

لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ(144)

 దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు

۞ فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ(145)

 ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము

وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ(146)

 మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము

وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ(147)

 మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము

فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ(148)

 వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము

فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ(149)

 అయితే వారిని ఇలా అడుగు: ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా

أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ(150)

 లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా

أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ(151)

 అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు

وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ(152)

 అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు

أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ(153)

 ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ(154)

 మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు

أَفَلَا تَذَكَّرُونَ(155)

 ఏమీ? మీరు గ్రహించలేరా

أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ(156)

 లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా

فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ(157)

 మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి

وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ(158)

 మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని

سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ(159)

 వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)

إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ(160)

 ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప

فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ(161)

 ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)

مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ(162)

 ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు

إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ(163)

 భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప

وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ(164)

 (దైవదూతలు ఇలా అంటారు): మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు

وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ(165)

 మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము

وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ(166)

 మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే

وَإِن كَانُوا لَيَقُولُونَ(167)

 మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు

لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ(168)

 ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే

لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ(169)

 మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము

فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ(170)

 కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు

وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ(171)

 మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది

إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ(172)

 నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని

وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ(173)

 మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని

فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ(174)

 కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు

وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ(175)

 మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ(176)

 ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా

فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ(177)

 కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు

وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ(178)

 కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు

وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ(179)

 మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ(180)

 నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు

وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ(181)

 మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)

وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ(182)

 మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు


Telugu diğer sureler:

Bakara suresi Âl-i İmrân Nisâ suresi
Mâide suresi Yûsuf suresi İbrâhîm suresi
Hicr suresi Kehf suresi Meryem suresi
Hac suresi Kasas suresi Ankebût suresi
As-Sajdah Yâsîn suresi Duhân suresi
fetih suresi Hucurât suresi Kâf suresi
Necm suresi Rahmân suresi vakıa suresi
Haşr suresi Mülk suresi Hâkka suresi
İnşikâk suresi Alâ suresi Gâşiye suresi

En ünlü okuyucuların sesiyle Saffat Suresi indirin:

Surah As-Saaffat mp3: yüksek kalitede dinlemek ve indirmek için okuyucuyu seçerek
Saffat Suresi Ahmed El Agamy
Ahmed El Agamy
Saffat Suresi Saad Al Ghamdi
Saad Al Ghamdi
Saffat Suresi Saud Al Shuraim
Saud Al Shuraim
Saffat Suresi Abdul Basit Abdul Samad
Abdul Basit
Saffat Suresi Abdullah Basfar
Abdullah Basfar
Saffat Suresi Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
Saffat Suresi Ali Al Hudhaifi
Ali Al Hudhaifi
Saffat Suresi Fares Abbad
Fares Abbad
Saffat Suresi Maher Al Muaiqly
Maher Al Muaiqly
Saffat Suresi Muhammad Jibril
Muhammad Jibril
Saffat Suresi Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
Saffat Suresi Al Hosary
Al Hosary
Saffat Suresi Al-afasi
Mishari Al-afasi
Saffat Suresi Nasser Al Qatami
Nasser Al Qatami
Saffat Suresi Yasser Al Dosari
Yasser Al Dosari


Sunday, December 22, 2024

Bizim için dua et, teşekkürler