అల్-ఆరాఫ్ · 125/206
అనువాదం ఉచ్చారణ — అల్-ఆరాఫ్
قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ ۝١٢٥
Qaaloo innaaa ilaa Rabbinaa munqaliboon
📖 తెలుగులో
వారు ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది

🎧 వినండి


📜 వచనం 123-127 — అల్-ఆరాఫ్

123قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఫిర్ఔన్ అన్నాడు: నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు
124لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను
125قَالُوا إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
వారు ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది
126وَمَا تَنقِمُ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِآيَاتِ رَبِّنَا لَمَّا جَاءَتْنَا ۚ رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ
మరియు మా ప్రభువు తరఫు నుండి మా వద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకోదలచావు." (ఇలా ప్రార్థించారు): ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందేటట్లు చేయి
127وَقَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ أَتَذَرُ مُوسَىٰ وَقَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَيَذَرَكَ وَآلِهَتَكَ ۚ قَالَ سَنُقَتِّلُ أَبْنَاءَهُمْ وَنَسْتَحْيِي نِسَاءَهُمْ وَإِنَّا فَوْقَهُمْ قَاهِرُونَ
మరియు ఫిర్ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచి పోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతి వారిని వదులుతున్నావా?" అతడు (ఫిర్ఔన్) జవాబిచ్చాడు: మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగి ఉన్నాము
అల్-ఆరాఫ్ఖురాన్ సూచిక
206వచనం
MeccanRevelation
125వచనం

అనువాదం — అల్-ఆరాఫ్ 125

సూరా అల్-ఆరాఫ్ వచనం 125 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది

సూరా వచనం 125/206 — అల్-ఆరాఫ్ الأعراف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆరాఫ్ వినండి, అల్-ఆరాఫ్ అనువాదం, అల్-ఆరాఫ్ mp3, అల్-ఆరాఫ్ pdf. వచనం 123–127. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers