سورة الإسراء بالتيلجو
తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు |
మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు |
ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا(3) మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు |
మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు |
ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది |
ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము |
(మరియు మేము అన్నాము): ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము) |
(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము |
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది |
وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا(10) మరియు నిశ్చయంగా, పరలోకాన్ని విశ్వసించిన వారికి మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచామని (తెలియజేస్తుంది) |
وَيَدْعُ الْإِنسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنسَانُ عَجُولًا(11) మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు) |
మరియు మేము రాత్రింబవళ్ళను రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము. మరియు పగటి సూచనను - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు (కాలాన్ని) గణించటానికి - ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము |
మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు |
اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا(14) (అతనితో ఇలా అనబడుతుంది): నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో! ఈ రోజు నీ (కర్మల) లెక్క చూసుకోవటానికి స్వయంగా నీవే చాలు |
ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము |
మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలచు కున్నప్పుడు (మొదట) అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాము; ఆ పిదప కూడా వారు భ్రష్టాచారానికి పాల్పడితే! అప్పుడు దానిపై (మా) ఆదేశం జారీ చేయబడుతుంది. అప్పుడు మేము దానిని నాశనం చేస్తాము |
మరియు మేము నూహ్ తర్వాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువే చాలు |
ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు |
మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది |
నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించ బడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు |
చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది |
لَّا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُولًا(22) (ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు |
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు |
మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు |
మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులయితే, నిశ్చయంగా ఆయన వైపునకు (పశ్చాత్తాపంతో) పలుమార్లు మరలే వారిని ఆయన క్షమిస్తాడు |
وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تُبَذِّرْ تَبْذِيرًا(26) మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు. మరియు (నీ ధనాన్ని) వృథా ఖర్చులలో వ్యర్థం చేయకు |
إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا(27) నిశ్చయంగా, వ్యర్థమైన ఖర్చులు చేసేవారు షైతానుల సోదరులు. మరియు షైతాన్ తన ప్రభువు పట్ల కృతఘ్నుడైన వాడు |
మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి - నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా - వారితో మృదువుగా మాట్లాడు |
మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదలి పెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు) |
నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగేవాడూ, చూసేవాడూను |
మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం |
وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا(32) మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము |
న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది |
మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది |
మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు (తూచి ఇచ్చేటప్పుడు) త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు (ఇదే) చివరకు మంచి ఫలితం ఇస్తుంది |
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది |
وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَن تَخْرِقَ الْأَرْضَ وَلَن تَبْلُغَ الْجِبَالَ طُولًا(37) మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు |
ఇవన్నీ దుష్కార్యాలే, నీ ప్రభువు దృష్టిలో ఎంతో అసహ్యకరమైనవి |
ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు |
ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట |
وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا(41) మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది |
قُل لَّوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَّابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا(42) వారితో అను: ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా |
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا(43) ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు) |
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా, ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు |
మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెర వేసి ఉన్నాము |
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు |
వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే |
انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا(48) (ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు |
وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا(49) మరియు వారు ఇలా అంటారు: ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా |
వారితో అను: మీరు రాళ్ళుగా గానీ, లేదా ఇనుముగా గానీ మారిపోయి ఉండినా సరే |
లేదా! తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించే దానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు)". వారు మళ్ళీ ఇలా అడుగుతారు: మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగల వాడు ఎవడు?" వారితో అను: ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడు!" వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు: అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?" వారితో అను: బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు |
يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا(52) ఆ దినమున, ఆయన మిమ్మల్ని పిలిచినపుడు! మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు. మరియు మీరు కేవలం కొంత కాలం మాత్రమే (భూమిలో) ఉండి వున్నట్లు భావిస్తారు |
మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు |
మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించ వచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించవచ్చు! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను వారి కార్యకర్తగా (రక్షకునిగా) నియమించి పంపలేదు |
మరియు భూమ్యాకాశాలలో ఉన్న వారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనత నొసంగాము. మరియు మేము దావూద్ కు జబూర్ ఇచ్చాము |
వారితో ఇట్లను: ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు |
వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే |
మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠినశిక్షకు గురిచేయని, నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి వుంది |
మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే |
నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు." అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకం చేసుకో)! మేము నీకు (ఇస్రా రాత్రిలో) చూపిన దృశ్యం - మరియు ఖుర్ఆన్ లో శపించబడిన (నరక) వృక్షం - మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయ పెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది |
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు. అతడు అన్నాడు: ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా |
ఇంకా ఇలా అన్నాడు: ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను |
قَالَ اذْهَبْ فَمَن تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَّوْفُورًا(63) ఆయన (అల్లాహ్) అన్నాడు: సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది. పరిపూర్ణ ప్రతిఫలం |
మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు. మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు. మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా మరియు వారితో వాగ్దానాలు చెయ్యి. మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి |
إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا(65) నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు |
మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత |
మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు |
ఏమీ? ఆయన! నేల చీలిపోయి మిమ్మల్ని మ్రింగకుండా; లేదా తుఫాను మీపై రాకుండా; మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా?" అప్పుడు మీరు ఏ రక్షకుడినీ పొందలేరు |
లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము |
(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము. అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు, తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు |
మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు |
وَمَن كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا(72) మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు |
మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే వాడవు |
وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا(74) అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచి చూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని ఎవ్వడినీ నీవు పొంది వుండేవాడవు కాదు |
إِذًا لَّأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا(75) మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు |
(ఓ ముహమ్మద్!) ఇది వాస్తవానికి! మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరికీ వర్తించిన సంప్రదాయమే |
سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا(77) నీవు మా సాంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు |
మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది |
وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا(79) మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి. ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామ్మ్ మహ్మూద్) నొసంగవచ్చు |
మరియు ఇలా ప్రార్థించు: ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు |
وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا(81) మరియు ఇలా అను: సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు |
మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు |
మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు) |
قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا(84) వారితో ఇలా అను: ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు |
మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది |
మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు |
إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا(87) కేవలం నీ ప్రభువు కారుణ్యం తప్ప! నిశ్చయంగా, నీపై ఉన్న ఆయన (నీ ప్రభువు) అనుగ్రహం ఎంతో గొప్పది |
ఇలా అను: ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు |
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలామంది ప్రజలు సత్యతిరస్కారులు గానే ఉండిపోయారు |
وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعًا(90) మరియు వారు ఇలా అంటారు: (ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింప జేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము |
أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا(91) లేదా! నీ కొరకు ఖర్జూరపు మరియు ద్రాక్షతోట ఏర్పడి దాని మధ్య నుండి సెలయేళ్ళు పొంగి ప్రవహింప జేయనంత వరకు |
లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు, ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు |
లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కి పోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము." వారితో అను: నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే |
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప |
ఇలా అను: ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే, మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండేవారము |
قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا(96) ఇలా అను: నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగువాడు, సర్వదృష్టికర్త |
మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము |
అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా |
ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు |
వారితో అను: ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు. మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి |
మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను |
(మూసా) అన్నాడు: నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను |
فَأَرَادَ أَن يَسْتَفِزَّهُم مِّنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَن مَّعَهُ جَمِيعًا(103) అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్ఔన్ ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచి వేశాము |
మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము |
وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا(105) మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము |
وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا(106) మరియు నీవు ప్రజలకు నెమ్మది నెమ్మదిగా చదివి వినిపించాలని, మేము ఖుర్ఆన్ ను విభజించి, క్రమక్రమంగా అవతరింపజేశాము |
వారితో అను: మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు |
وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا(108) మరియు ఇలా అంటారు: మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది |
وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩(109) మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడి పోతారు. మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది |
వారితో అను: మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు |
ఇంకా ఇలా అను: సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి |
المزيد من السور باللغة التيلجو:
تحميل سورة الإسراء بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة الإسراء كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Wednesday, January 22, 2025
لا تنسنا من دعوة صالحة بظهر الغيب