سوره غافر به زبان تلوگو
حم(1) హా-మీమ్ |
ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది |
పాపాలను క్షమించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, ఎంతో ఉదార స్వభావుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది |
సత్యతిరస్కారులు తప్ప, ఇతరులెవ్వరూ అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి వాదించరు, కావున భూమిలో వారి గర్వపూరితమైన నడక నిన్ను మోసగింపనివ్వరాదు |
వారికి పూర్వం గడిచిన నూహ్ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. మరియు ప్రతి సమాజం వారు తమ సందేశహరుణ్ణి నిర్భంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించటానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో |
وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ(6) మరియు ఈ విధంగా సత్యతిరస్కారానికి పాల్పడిన వారిని గురించి: నిశ్చయంగా వారు నరకవాసులు." అని, అన్న నీ ప్రభువు వాక్కు సత్యమయ్యింది |
సింహాసనాన్ని (అర్ష్ ను) మోసేవారు మరియు దాని చుట్టూ ఉండేవారు (దైవదూతలు), తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరియు విశ్వసించిన వారి కొరకు క్షమాభిక్ష కోరుతూ: ఓ మా ప్రభూ! నీవు నీ కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు. కావున పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలి, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు; మరియు వారిని భగభగమండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడు |
ఓ మా ప్రభూ! ఇంకా వారిని, నీవు వాగ్దానం చేసిన, కలకాలముండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి మరియు వారి తండ్రులలో వారి సహవాసులలో (అజ్వాజ్ లలో) మరియు వారి సంతానంలో, సద్వర్తనులైన వారిని కూడా! నిశ్చయంగా నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు |
మరియు వారిని దుష్కార్యాల నుండి కాపాడు. మరియు ఆ రోజు నీవు ఎవడినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో! వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే! మరియు అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం) |
నిశ్చయంగా, (ఆ రోజు) సత్యతిరస్కారులను పిలిచి వారితో: ఈరోజు మీకు, మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో! మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినపుడు, అల్లాహ్ కు మీ పట్ల ఇంత కంటే ఎక్కువ అసహ్యం కలిగేది!" అని అనబడుతుంది |
వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా |
(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు అయిన అల్లాహ్ చేతిలో ఉంది |
ఆయనే మీకు తన అద్భుత సూచనలను చూపించేవాడు మరియు ఆకాశం నుండి మీ కొరకు జీవనోపాధిని అవతరింపజేసేవాడు. కాని, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలేవారు తప్ప, ఇతరులు వీటిని గ్రహించలేరు |
فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ(14) కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా |
ఆయన మహోన్నతమైన స్థానాలు గలవాడు, (సర్వాధికార) సింహాసనానికి (అర్ష్ కు) అధిపతి, తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై, తన ఆజ్ఞ ప్రకారం, తన దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) అవతరింపజేస్తాడు, ఆయనతో సమావేశమయ్యే దినమును గురించి హెచ్చరించటానికి |
ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ అయిన అల్లాహ్ దే |
ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు |
మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ, ఎవ్వడూ ఉండడు |
ఆయన (అల్లాహ్)కు, చూపులలోని నమ్మకద్రోహం మరియు హృదయాలలో దాగివున్న రహస్యాలు అన్నీ తెలుసు |
మరియు అల్లాహ్, న్యాయంగా తీర్పు చేస్తాడు. మరియు వారు ఆయనను (అల్లాహ్ ను) వదలి ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి తీర్పు చేయలేరు. నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు |
ఏమీ? వారు భూమిలో సంచారం చేసి తమకు ముందు గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో చూడలేదా? వారు, వీరి కంటే ఎక్కువ బలం గలవారు. మరియు వీరి కంటే ఎక్కువ గుర్తులను భూమిలో వదిలి పోయారు; కాని అల్లాహ్ వారి పాపాలకుగానూ వారిని పట్టుకున్నాడు మరియు అప్పుడు వారిని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడూ లేక పోయాడు |
ఇలా ఎందుకు జరిగిందంటే! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు! కాని వారు, వారిని తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారిని శిక్షకు గురి చేశాడు. నిశ్చయంగా, ఆయన మహా బలశాలి, శిక్ష విధించటంలో కఠినుడు |
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ(23) మరియు వాస్తవంగా, మేము మూసాను మా సూచనలతో (ఆయాత్ లతో) మరియు స్పష్టమైన అధికారంతో పంపి ఉన్నాము |
إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ(24) ఫిర్ఔన్, హామాన్ మరియు ఖారూన్ ల వద్దకు! కాని వారు: ఇతను మాంత్రికుడు, అసత్యవాది!" అని అన్నారు |
తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి |
మరియు ఫిర్ఔన్ ఇలా అన్నాడు: మూసాను చంపే పని నాకు వదలి పెట్టండి; అతనిని తన ప్రభువును పిలుచుకోనివ్వండి. వాస్తవానికి, నా భయమేమిటంటే, అతను మీ ధర్మాన్ని మార్చవచ్చు, లేదా దేశంలో కల్లోల్లాన్ని రేకెత్తించవచ్చు |
మరియు మూసా అన్నాడు: నిశ్చయంగా, నేను లెక్క తీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి కాపాడటానికి, నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను |
అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్ఔన్ కుటుంబపు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఏమీ? మీరు, `అల్లాహ్ యే నా ప్రభువు.` అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడుతుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు |
ఓ నా జాతి ప్రజలారా! ఈనాడు రాజ్యాధికారం మీదే; దేశంలో మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు, కాని ఒకవేళ అల్లాహ్ శిక్ష మన మీద వచ్చి పడితే, అప్పుడు మనకెవడు సహాయం చేయగలడు?" అప్పుడు ఫిర్ఔన్ అన్నాడు: నాకు సముచితమైన మార్గమే నేను మీకూ చూపుతాను, నేను మీకు మార్గదర్శకత్వం చేసేది కేవలం సరైన మార్గం వైపునకే |
وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ الْأَحْزَابِ(30) మరియు విశ్వసించిన ఆ వ్యక్తి అన్నాడు: నా జాతి ప్రజలారా! నిశ్చయంగా పూర్వం అనేక సంఘాలకు దాపురించిన దినమే మీకూ దాపురించునేమోనని నేను భయపడుతున్నాను |
నూహ్, ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారికి వచ్చినటువంటి (దుర్దినం). మరియు అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేయగోరడు |
وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ(32) మరియు ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి నేను, మీరు పరస్పరం పిలుచుకునే, ఆ దినం గురించి భయపడుతున్నాను |
ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు |
మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకొని వచ్చాడు. కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు. చివరకు అతడు మరణించినప్పుడు, మీరన్నారు: ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు!" ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని, సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు |
ఎవరైతే అల్లాహ్ సూచన (ఆయాత్) లను గురించి తమ దగ్గర ఏ ఆధారంలేనిదే వాదిస్తారో, వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు. ఈ విధంగా అల్లాహ్ దురహంకారీ, నిర్దయుడూ (క్రూరుడు) అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు |
وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَّعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ(36) మరియు ఫిరఔన్ ఇలా అన్నాడు: ఓ హామాన్! నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు, బహుశా (దాని పైకి ఎక్కి) నేను మార్గాలను పొందవచ్చు |
ఆకాశాలలోనికి వెళ్ళే మార్గాలు! మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి. ఎందుకంటే, నిశ్చయంగా, నేను అతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను!" మరియు ఈ విధంగా ఫిరఔన్ కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి. మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు. మరియు ఫిరఔన్ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది |
وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ(38) మరియు విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు: నా జాతి ప్రజలారా! నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను |
يَا قَوْمِ إِنَّمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ(39) నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చయంగా, పరలోకమే శాశ్వతమైన నివాస స్థలము |
దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది |
۞ وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ(41) మరియు నా జాతి ప్రజలారా! ఇది ఎంత విచిత్రమైన విషయం! నేనేమో మిమ్మల్ని ముక్తి వైపునకు పిలుస్తున్నాను. మరియు మీరేమో నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు |
మీరు నన్ను - అల్లాహ్ ను తిరస్కరించి - ఎవరిని గురించైతే నాకు ఎలాంటి జ్ఞానం లేదో! వారిని, ఆయనకు భాగస్వాములుగా కల్పించమని పిలుస్తున్నారు. మరియు నేనేమో మిమ్మల్ని సర్వశక్తిమంతుని, క్షమాశీలుని వైపునకు పిలుస్తున్నాను |
నిస్సందేహంగా! వాస్తవానికి మీరు దేని వైపునకైతే (ప్రార్థించటానికి) నన్ను పిలుస్తున్నారో! దానికి ఇహలోకంలోను మరియు పరలోకంలోను ప్రార్థనా అర్హత లేదు. మరియు నిశ్చయంగా, మనందరి మరలింపు అల్లాహ్ వైపునకే మరియు నిశ్చయంగా, మితి మీరి ప్రవర్తించే వారే నరకాగ్ని వాసులవుతారు |
కావున నేను మీతో చెప్పే విషయం మున్ముందు మీరే తెలుసుకోగలరు. ఇక నా వ్యవహారాన్ని నేను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు |
فَوَقَاهُ اللَّهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ(45) ఆ తరువాత అల్లాహ్ అతనిని వారు పన్నిన చెడు కుట్ర నుండి కాపాడాడు. మరియు ఫిరఔన్ జనులను దుర్భరమైన శిక్ష చుట్టుకున్నది |
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది |
ఇక వారు నరకాగ్నిలో పరస్పరం వాదులాడుతున్నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా పరిగణింపబడిన వారు, పెద్ద మనుషులుగా (నాయకులుగా) పరిగణింపబడే వారితో ఇలా అంటారు: వాస్తవానికి, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే వారము, కావున మీరిప్పుడు మా నుండి నరకాగ్నిని కొంతనైనా తొలగించగలరా |
قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ(48) దుహంకారంలో మునిగి ఉన్నవారు (ఆ పెద్ద మనుషులు) ఇలా అంటారు: వాస్తవానికి, మనమందరం అందులో (నరకాగ్నిలో) ఉన్నాం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల మధ్య వాస్తవమైన తీర్పు చేశాడు |
మరియు నరకాగ్నిలో పడివున్న వారు, నరకపు రక్షకులతో: మా శిక్షను కనీసం ఒక్కరోజు కొరకైనా తగ్గించమని, మీరు మీ ప్రభువును ప్రార్థించండి!" అని అంటారు |
వారు (రక్షకులు) అంటారు: ఏమీ? మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మీ దైవప్రవక్తలు రాలేదా?" అప్పుడు వారంటారు: అవును (వచ్చారు)!" వారికి ఇలా జవాబివ్వబడుతుంది: అయితే మీరే ప్రార్థించండి!" కాని సత్యతిరస్కారుల ప్రార్థన నిష్ఫలమే అవుతుంది |
నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము |
يَوْمَ لَا يَنفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ(52) ఆరోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు. వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది. మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది |
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ(53) మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము |
బుద్ధిమంతులకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా |
కావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం; నీ పాపాలకు క్షమాపణ వేడుకో మరియు సాయంత్రం మరియు ఉదయం నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయనను స్తుతించు |
నిశ్చయంగా, ఎవరైతే, తమ దగ్గర, ఎలాంటి ప్రమాణం లేనిదే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడుతారో, వారి హృదయాలలో వాస్తవానికి గొప్పతనపు గర్వం నిండి ఉంది. కాని వారు దానిని (గొప్పతనాన్ని) పొందజాలరు. కావున నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు |
వాస్తవానికి, ఆకాశాలను మరియు భూమిని స్పష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు |
మరియు గ్రుడ్డివాడు మరియు చూడగలవాడు సరిసమానులు కాజాలరు మరియు అదే విధంగా! విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు దుర్వర్తనులు కూడా (సమానులు కాజాలరు). మీరు అర్థం చేసుకునేది చాలా తక్కువ |
إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ(59) నిశ్చయంగా, అంతిమ ఘడియ తప్పక రానున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది ప్రజలు విశ్వసించరు |
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు |
అల్లాహ్! ఆయనే, మీ కొరకు విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మరియు (చూడటానికి) ప్రకాశవంతమైన పగటిని నియమించినవాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల ఎంతో అనుగ్రహుడు, కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు తెలుపరు |
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ(62) ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు) |
كَذَٰلِكَ يُؤْفَكُ الَّذِينَ كَانُوا بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ(63) ఇదే విధంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించే వారందరూ మోసగింపబడుతూ ఉంటారు |
అల్లాహ్ యే! మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియమించిన వాడు మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు. కావున అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు ప్రభువు |
ఆయన సజీవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున మీరు ఆయననే ప్రార్థించండి! మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోండి. సర్వస్తోత్రాలకు అర్హుడు, సర్వలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే |
ఇలా అను: నిశ్చయంగా, నా ప్రభువు తరఫు నుండి, నాకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతనే, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవాటి ఆరాధన నుండి నేను వారించబడ్డాను మరియు నేను సర్వలోకాల ప్రభువుకు మాత్రమే విధేయుడను (ముస్లింను) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను |
ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది) |
هُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ(68) జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు, కేవలం దానితో: అయిపో!" అని అంటాడు, అంతే అది ఆయిపోతుంది |
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ أَنَّىٰ يُصْرَفُونَ(69) ఏమీ? నీకు తెలియదా? అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడేవారు ఏ విధంగా (సత్యం నుండి) తప్పించబడుతున్నారో |
الَّذِينَ كَذَّبُوا بِالْكِتَابِ وَبِمَا أَرْسَلْنَا بِهِ رُسُلَنَا ۖ فَسَوْفَ يَعْلَمُونَ(70) ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు |
إِذِ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَالسَّلَاسِلُ يُسْحَبُونَ(71) ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడతాయో మరియు వారు ఈడ్చబడతారో |
సలసలకాగే నీళ్ళలోకి; తరువాత నరకాగ్నిలోకి కాల్చబడటానికి |
అప్పుడు వారితో అనబడుతుంది: మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు |
(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు |
ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ(75) (వారితో ఇలా అనబడుతుంది): ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించినందుకూ |
ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ(76) (కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస స్థలం ఎంత దుర్భరమైనది |
కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు |
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా ఏ అద్భుత క్రియలను (ఆయాత్ లను) స్వయంగా చేయలేడు. కాని అల్లాహ్ ఆజ్ఞ వచ్చినపుడు, న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు అప్పుడు అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు |
اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ(79) అల్లాహ్ మీ కొరకు పశువులను సృష్టించాడు, వాటి మీద మీరు సవారీ చేయటానికి మరియు వాటిలో కొన్నింటిని మీరు తినుటకూను |
మరియు వాటి వల్ల మీకు ఇతర లాభాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మీ హృదయాలు కోరిన చోట్లకు పోవటానికి ఉపయోగపడతాయి మరియు వాటి మీద మరియు పడవల మీద మీరు తీసుకు పోబడతారు |
మరియు (ఈ విధంగా) ఆయన మీకు తన సూచనలను (ఆయాత్ లను) చూపుతున్నాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఏ సూచనలను (ఆయాత్ లను) మీరు నిరాకరిస్తారు |
ఏమీ? వీరు భూమిలో సంచరించలేదా? అప్పుడు వీరికి పూర్వం గతించిన వారి గతి ఏమయిందో కనిపించలేదా? వారు వీరి కంటే సంఖ్యాపరంగా అధికులు మరియు వీరి కంటే ఎక్కువ బలవంతులు మరియు భూమిలో (ఎక్కువ) చిహ్నాలు వదలి పోయారు, కాని వారి సంపాదన వారికి ఏ విధంగానూ పనికి రాలేదు |
ఎందుకంటే! వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు, వారు తమ దగ్గరున్న జ్ఞానానికి గర్వపడ్డారు; కాబట్టి వారు దేనిని గురించి పరిహాసాలాడుతూ ఉన్నారో అదే వారిని చుట్టుకున్నది |
ఆ తరువాత మా శిక్షను చూసినప్పుడు వారు ఇలా అన్నారు: మేము అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము మరియు మేము (అల్లాహ్ కు) సాటి కల్పిస్తూ వచ్చిన భాగస్వాములను తిరస్కరిస్తున్నాము |
కాని మా శిక్షను చూసిన తర్వాత, వారి విశ్వాసం వారికి ఏ మాత్రం లాభదాయకం కాజాలదు. ఇదే అల్లాహ్ తన దాసుల కొరకు వాస్తవంగా, నియమించిన విధానం (సాంప్రదాయం). మరియు అక్కడ సత్యతిరస్కారులు నష్టానికి గురి అవుతారు |
سورهای بیشتر به زبان تلوگو:
دانلود سوره غافر با صدای معروفترین قراء:
انتخاب خواننده برای گوش دادن و دانلود کامل سوره غافر با کیفیت بالا.
أحمد العجمي
ابراهيم الاخضر
بندر بليلة
خالد الجليل
حاتم فريد الواعر
خليفة الطنيجي
سعد الغامدي
سعود الشريم
الشاطري
صلاح بوخاطر
عبد الباسط
عبدالرحمن العوسي
عبد الرشيد صوفي
عبدالعزيز الزهراني
عبد الله بصفر
عبد الله الجهني
علي الحذيفي
علي جابر
غسان الشوربجي
فارس عباد
ماهر المعيقلي
محمد أيوب
محمد المحيسني
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
وديع اليمني
ياسر الدوسري
به قرآن کریم چنگ بزنید